ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విస్రమించ వద్దు ఏ క్షణం
విస్మరించ వద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా.....
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి .....
నింగి ఎంత పెద్దదైన రివ్వు మన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా
సంద్రం ఎంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా..
గుటక పడని అగ్గి ఉండ సాగరాన ఈదుకుంటు తూరుపింట తేలుతుందిరా...
నిశావిలాసమెంత సేపు రా.. ఉషోదయాన్ని ఎవ్వడాపురా ..
రగులుతున్న గుండె కూడ అగ్నిగుండమంటిదెనురా.....
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి .....
నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపొతే నిమిషమైన నీదికాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షన
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
ఆశనీకు అశ్త్రమవును శ్వాశ నీకు శస్త్రమవును ఆశయమ్ము సారథవునురా
నిరంతరం ప్రయత్నమున్నదా ......
నిరశకే నిరాశ పుట్టదా .....
ఆయువంటు ఉన్నవరకు చావు కూడ నెగ్గలేక శవము పైనే గెలుపు చాటు రా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి .....
-సిరివెన్నల సీతారమశాస్త్రి
No comments:
Post a Comment